కలం, తెలంగాణ బ్యూరో: Sleeper Bus Safety | కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా స్లీపర్ బస్సుల ప్రమాదాలకూ అనేక కారణాలున్నాయి. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల (యజమానుల) కాసుల కక్కుర్తి, రవాణా శాఖ అధికారుల అవినీతి, ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన.. ఇవన్నీ కారణాలే! రాత్రి బస్సెక్కి తెల్లవారేటప్పటికి ఇంటికి చేరాలనే ప్రయాణికుల ఆరాటం కూడా ఓ ప్రధాన కారణం. ‘హోటల్ ఆన్ వీల్స్’, ‘లగ్జరీ స్లీప్’, ‘స్లీప్ అండ్ రిలాక్స్’.. ఇలాంటి ఎన్ని ట్యాగ్‌లైన్లు తగిలించినా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ‘డెత్ ట్రాప్’ అవుతున్నది. ‘డైరెక్ట్ జర్నీ టు హెల్’ అనే ట్యాగ్‌లైన్ తగిలించిన సందర్భాలూ ఉన్నాయి.
‘సురక్షిత ప్రయాణం’ అని ఆర్టీసీ చెప్పినా, ‘మీ గమ్యానికి నమ్మకమైన ప్రయాణం’ అని రైల్వే చెప్పినా, ‘వేగంగా చేరండి.. విశ్రాంతిగా నిద్రించండి’ అని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ చెప్పినా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాల వేదన, రోదన వర్ణనాతీతం. రైళ్లు, ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సులున్నా ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యే ఎక్కువ. అన్ని రాష్ట్రాలను కలుపుకుంటే సగటున ఏటా సుమారు 3 వేల కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అంచనా.
ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పోలిస్తే ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదాలు తీవ్ర స్వభావంతో కూడుకుని ఉంటాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దేశం మొత్తం మీద 145 మంది చనిపోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఘాటుగా రియాక్ట్ అయింది. లోపాలతో కూడిన స్లీపర్ కోచ్ బస్సులన్నింటినీ షెడ్డుకు పంపాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ప్రమాదాలు, ప్రభుత్వ విభాగాల నోటీసులు ‘షరా మామూలు’గా మారిపోయాయి.
బస్సుల బాడీ బిల్డింగ్‌లోని లోపం, లోకల్ షెడ్‌లలో చేసే డిజైన్ మార్పులు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ లేకపోవడం, మొక్కుబడిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రవాణా శాఖ తనిఖీలు లేకపోవడం, నాసిరకపు వైరింగ్.. స్లీపర్ కోచ్ బస్సుల్లోని ఇలాంటి అనేక లోపాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. నిబంధనలేం చెప్తున్నాయి, ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఏయే స్థాయిలో బాధ్యతారాహిత్యం ఉన్నది.. వీటిపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On : WhatsApp

