కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)ను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం అందుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై పలు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారని వార్తలు అందుతున్నాయి.
ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ (Balka Suman) వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమయ్యింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో బాల్క సుమన్ వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ డీజీపీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. అలాగే ఆయనపై పలు స్టేషన్ లలో నమోదైన కేసుల ఆధారంగా బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాంపల్లి కోర్టు పరిసరాల్లో బందోబస్తును పటిష్ఠం చేశారని తెలుస్తోంది.
Read Also: మహిళతో అసభ్య ప్రవర్తన : కేటరింగ్ కార్మికులకు జైలు!
Follow Us On : WhatsApp

