తెలంగాణలో నేటి నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు (Fire Safety Week celebrations) నిర్వహిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగనున్నాయి. అగ్నిప్రమాదాలను అరికట్టడంపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిచనుంది. హైదరాబాద్ లోని వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శిక్షణ కేంద్రంలో వారోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రమాదాల్లో మృతి చెందిన అగ్నిమాపక సిబ్బందికి అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ నివాళులర్పించనున్నారు. వారోత్సవాల్లో భాగంగా బహుళ అంతస్తుల భవనాల్లో మాక్‌డ్రిల్స్‌ నిర్వహించనున్నారు.

వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ప్రమాద నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేయనున్నారు. నిర్లక్ష్యంగా పొగ తాగడం, విద్యుదాఘాతం, వంట గ్యాస్, ఎక్కువ వేడికి గురయ్యే వస్తువుల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 1944 ఏప్రిల్‌ 14న బాంబే పోర్టులో విక్టోరియా పేరిట జరిగిన భారీ పడవ అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్‌ 14న అగ్నిమాపక శాఖ అధికారులు (Fire Department Officials) వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రమాదాల్లో మృతి చెందిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించి వారి సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>