కలం, వెబ్ డెస్క్: భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ (BR Ambedkar) 135వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆ మహోన్నతుడికి ఘన నివాళులు సమర్పించారు. అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం అని పేర్కొన్నారు. అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు అంబేద్కర్ అని.. సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు అంబేద్కర్ అని తెలిపారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహా మేధావి అంబేద్కర్ అని పేర్కొన్నారు.
ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు అంబేద్కర్ అని కీర్తించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలన సాగిందని.. భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంబేద్కర్ బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అందించేలా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టి వారికి సమున్నత గౌరవాన్ని కల్పించిందని.. జోహార్ అంబేద్కర్! జై భీమ్! అని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.
Read Also: స్లీపర్ బస్సు.. జర్నీ టు హెల్
Follow Us On: WhatsApp

