నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

సెంట్రల్ డెస్క్, కలం: Gen Z Mindset | ‘‘హలో సార్..! నాకు బ్రేకప్ అయింది. నన్ను నేను తిరిగి మేకప్ చేసుకోవాలి. పది రోజులు లీవ్ కావాలి” ..ఇదీ ఇటీవల బాస్‌కు ఓ ఎంప్లాయీ పెట్టుకున్న లీవ్​ అప్లికేషన్! ‘‘సార్, మీరు ఏమన్నా అనుకోండి. వీకాఫ్ రోజు మాత్రం డ్యూటీకి రాలేను. నా బయోలజికల్ సిస్టమ్ దెబ్బతింటుంది. కాదూ కూడదూ అంటే.. రిజైన్ చేయడానికి రెడీ!” ..ఇదీ ఓ ప్రైవేట్ కంపెనీలో హెడ్‌తో యువ ఉద్యోగి వాదన! ‘‘అమ్మా.. నాన్నా..! మీకు చెప్పదలచుకున్నది ఒక్కటే!! నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కెరీర్ ముఖ్యం. మీ కాలం అమ్మాయిల్లా పెండ్లిచూపుల పేరిట ప్రతి ఒక్కడి ముందు తలవంచుకొని కూర్చోలేను. నాకు నచ్చినవాడిని, అదీ మీకు నచ్చజెప్పే చేసుకుంటా. దట్స్​ ఆల్​​!!’’ … ఇదీ ఓ యువతి నిర్ణయం! వీళ్లంతా జెన్ జీలు! కెరీర్ అయినా, మ్యారేజీ అయినా.. దేనికీ కాంప్రమైజ్ కావడం లేదు. ‘నా జీవితం.. నా ఇష్టం’ అనే రీతిలో డెసిషన్ తీసుకుంటున్నారు. పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. ఎవరికో నచ్చేలా కాకుండా వారికి నచ్చేలా కెరీర్‌‌ను, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు.

వర్క్‌లో బాస్ వేధింపులను ఇసుమంతైనా సహించడం లేదు. ముఖం ముందే రిజైన్ లెటర్ పడేస్తున్నారు. ఈ జాబ్ కాకపోతే మరోటి అన్న ధీమాలో ఉంటున్నారు. ఏదీ దొరక్కపోతే .. రీల్స్ అయినా చేసుకుంటామన్న కాన్ఫిడెన్స్‌తో బతికేస్తున్నారు. మానసిక ఒత్తిళ్లను దరిచేరనీయడం లేదు. కోపమొచ్చినా, తాపమొచ్చినా.. అన్నింటినీ లైట్ తీసుకుంటున్నారు. కొందరు అందివచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చెడుగుడు ఆడుకుంటున్నారు. సరికొత్త టూల్స్ డెవలప్ చేసి, కొత్తవాళ్లకు ఉపాధి కల్పిస్తున్నారు. జెన్ జీ లైఫ్ అండ్ కెరీర్‌‌పై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Gen Z Mindset
Gen Z Mindset

Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్​కు పరీక్ష

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>