కలం, వెబ్ డెస్క్: దేశంలో ప్రజాస్వామ్య విలువలపై మరింత విశ్వాసాన్ని పెంపొందించడం ఎంతో ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం(National Voters Day) సందర్భంగా ప్రధాని మోడీ (PM Modi) ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు తన సందేశం అందించారు. ఓటరు కావడం కేవలం రాజ్యాంగ హక్కుతో పాటు ప్రతి పౌరుడికి భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం దొరుకుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, ప్రతి ఎన్నికల్లో పాల్గొని ‘వికసిత భారత్’ భవితవ్యానికి బలం కల్పించామని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.
Read Also: హిందీని వ్యతిరేకిస్తూనే ఉంటాం : తమిళనాడు సీఎం స్టాలిన్
Follow Us On: Sharechat


