కలం, తెలంగాణ బ్యూరో: పసిపిల్లలు తాగే పాలు మొదలు వంటింట్లో వాడే కారం పొడి వరకు కల్తీమయం. పాలల్లో యూరియా, మసాలా పౌడర్‌లలో ఇటుక పొడి, టీ పౌడర్‌లో రంపపు పొట్టు, వంటనూనెలో ఆర్గెమోన్ సీడ్స్, అల్లం-వెల్లుల్లి పేస్టులో అరటి బెరడు.. ఇలా ఆహార పదార్ధాల్లోనూ యధేచ్ఛగా కల్తీ (Food Adulteration). ‘స్వదేశీ’ నినాదం మోజులో వాడే బాబా రాందేవ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులదీ అదే దారి. ఏపీ ప్రభుత్వ రంగ సంస్థ ‘విజయ’ నెయ్యిలోనూ రసాయనాలే. నిద్ర లేవగానే వాడే టూత్ పేస్ట్ మొదలు రాత్రిపూట వాడే మస్కిటో కాయిల్స్ వరకు అన్నింటా కల్తీ! కాదేదీ కల్తీకి అనర్హం. ఒరిజినల్ ఏదో.. నకిలీ ఏదో తెలియని గందరగోళం. బ్రాండ్‌లు ఘనమైనా ధీమాగా నమ్మలేం. చివరకు కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సైతం. అంతా నకిలీల రాజ్యం.. కల్తీల కమాల్!!
కల్తీ కట్టడిలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నామమాత్రమే. ఇదే ఆసరాగా కొందరు ఆఫీసర్లు జేబులు నిండుతున్నాయి. అనారోగ్యం బారిన పడిన జనం ఆస్పత్రుల్లో చేరడం… ఫుడ్ పాయిజన్ ఎఫెక్టుతో ప్రాణాలొదలడం.. కల్తీతో గుండెజబ్బులు, క్యాన్సర్ అంటూ డాక్టర్ల హెచ్చరించడం.. కామన్ అయిపోయాయి. అందుకే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్.. “కల్తీ చేయడమంటే హత్యాయత్నమే.. ఇది మైనర్ ఉల్లంఘన కాదు.. సీరియస్ క్రైమ్..” అని ఫైర్ అయ్యారు. కల్తీరాయుళ్ళ కాసుల కక్కుర్తి.. ప్రమాదంలో ప్రజల ప్రాణాలు. కల్తీలపై ‘కలం’ 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఆర్బీఐ అప్పుల్లో థర్డ్ ప్లేస్.. తొమ్మిది నెలల్లో రూ. 69 వేల కోట్లు
Follow Us On: X(Twitter)

