టెన్త్ ఎగ్జామ్స్ రాసేవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం : మంత్రి రాం ప్రసాద్

కలం, వెబ్ డెస్క్ : టెన్త్ ఎగ్జామ్స్ రాసే స్టూడెండ్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎగ్జామ్ హాల్ టికెట్ చూపించి ఫ్రీగా ఎగ్జామ్స్ సెంటర్ల దాకా జర్నీ చేయొచ్చని తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ దాకా ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 6.42 లక్షల మంది టెన్త్ స్టూడెంట్లు ఈ సేవలను వినియోగించుకుంటారని మంత్రి స్పష్టం చేశారు. స్టూడెంట్లు ఎక్కడ చేయి పెట్టి ఆపినా సరే బస్సు డ్రైవర్లు ఎక్కించుకోవాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులను ఇన్ టైమ్ లో ఎగ్జామ్ సెంటర్లకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>