కలం, తెలంగాణ బ్యూరో: ఇరాన్ లో వార్.. ఇప్పుడు వంటింట్లోకి వచ్చేసింది! వంట గ్యాస్ ధరలు పెరగడం (Price Hike).. ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగొచ్చన్న అనుమానాలు.. పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని ఎఫెక్ట్ మరింత పెరిగే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వ్యాపారులు పెంచేస్తున్నారు. కొందరు బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు 40 రూపాయలకు ప్లేట్ ఉన్న ఇడ్లీని ఇప్పుడు కొన్ని చోట్ల 50, 60 రూపాయలకు అమ్ముతున్నారు. బుక్ చేసుకున్న రెండురోజుల్లోపు రావాల్సిన ఎల్పీజీ సిలిండర్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.
గత నెల 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మొదలైన యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి. ఇది ఇంకా కొనసాగితే.. లోకల్ గా సామాన్యులు, చిరువ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనని కొందరు ముందే అలర్ట్ అవుతున్నారు. ఇంటికి కావాల్సిన వస్తువులను ఎక్కువ మోతాదులో తెచ్చిపెట్టుకుంటున్నారు.
ఇరాన్ లో యుద్ధంతో ఇక్కడి సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనలపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఏమన్నా స్పందించను: వేం నరేందర్ రెడ్డి
Follow Us On: Sharechat

