కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో ఆడ శిశువులను వదిలించుకుంటున్న హృదయ విదారక ఘటనలు కలచి వేస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్ నగరంలో చెత్త కుప్పలో ఆడ శిశువును వదిలి వెళ్తే అదృష్ట వశాత్తూ స్థానికులు గమనించడంతో పోలీసుల సహకారంతో ఆసుపత్రికి తరలించి కాపాడారు. ఇపుడు అలాంటి మరో ఘటన (Newborn Girl Died) వెలుగు చూసింది . కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) బస్టాండ్ లోని బాత్ రూం లో ఓ ఆడ శిశువును గుర్తు తెలియని మహిళ వదిలి వెళ్లారు.
ఆ ముక్కుపచ్చలారని పాప విగతజీవిగా పడి ఉండడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా పాప అప్పటికే మృతి చెందినట్లు (Newborn Girl Died) గుర్తించారు. . మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గుర్తుతెలియని మహిళ కావాలనే ఆడశిశువును పడేసిందా? చంపేసి వదిలించుకున్నారా? ఇంకేమైనా కోణం ఉందా అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పాపను చూసి బస్టాండ్ లోని జనాలు ప్రయాణికులు అంతా “అయ్యో పాప”ం అని బాధపడటం కనిపించింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వరుస ఆడ శిశువుల ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Read Also: ఉత్తమ ఎన్నికల విధులకు రాష్ట్ర స్థాయి అవార్డులు..
Follow Us On : WhatsApp


