కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) మరోసారి హిందీ (Hindi )భాషపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని ప్రకటించారు. బలవంతంగా తమపై హిందీ భాషను రుద్దుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం భాషా వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా స్టాలిన్ నివాళులు అర్పించారు. 1964-65లో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులను గుర్తు చేసుకున్నారు. హిందీకి రాష్ట్రంలో ఎక్కడా, ఎప్పుడూ స్థానం ఉండదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా స్టాలిన్ 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమం చరిత్రను వివరిస్తూ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో భాషా వీరుల త్యాగాలు, ఆ విషయంపై సీనియర్ డీఎంకే నేతలైన సీఎన్ అన్నాదురై, ఎం.కె. కరుణానిధి ముఖ్య పాత్రలు పోషించారని గుర్తు చేశారు. తమిళ భాష కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. భవిష్యత్తులో భాషా యుద్ధంలో మరొకరు ప్రాణాలు కోల్పోరేలా చూసుకుంటామని పేర్కొన్నారు. తమ గుర్తింపు ఎప్పటికీ నిలుస్తుందని, బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూనే ఉంటామని స్టాలిన్(CM Stalin) స్పష్టం చేశారు.
Read Also: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు మోడీ సందేశం
Follow Us On: X(Twitter)


