Mobile Popup Ad
Mobile Popup Ad

మిరాకిల్.. అంబులెన్స్ కుదుపుతో బ్రెయిన్ డెడ్ మహిళకు ప్రాణం

కలం, వెబ్ డెస్క్: ఏదైనా ప్రమాదం జరిగితే చాలామందికి వెంటనే అంబులెన్స్ (Ambulance) గుర్తుకువస్తుంది. హెల్ప్ లైన్‌కు నెంబర్ కాల్ చేసి అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకుంటారు. అయితే రోగులను తరలించే అంబులెన్స్ ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. ఈ వార్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ ఇది మాత్రం నిజం. ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttar Pradesh) పీలీభీత్‌కు చెందిన వినితా శుక్లా బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉండగా కుటుంబం ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తోంది. మార్గమధ్యలో వాహనం గుంతలో పడడంతో కుదుపు రావడంతో ఆమె అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నిజంగా ఇది మిరాకిల్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>