Mobile Popup Ad
Mobile Popup Ad

మెగా మ్యూజిక్.. మరో కొత్త దర్శకుడికి చిరు ఛాన్స్!

కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల ఎంపికలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సీనియర్ దర్శకులతోపాటు, ఈతరం యంగ్ డెరెక్టర్లకు వరుసగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టును ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుకుమార్ క్రియేటివ్ టీమ్‌లో భాగమైన దర్శకుడు శ్రీనివాస్‌తో మరో సినిమాను ఫైనల్ చేసినట్లు సమాచారం.

చిరు యువ దర్శకులతో (Directors) చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఒకవైపు విశ్వంభర వంటి భారీ సోషియో-ఫాంటసీ చిత్రాలతో ప్రయోగాలు చేస్తూనే, మరోవైపు కమర్షియల్ హంగులతో కూడిన విభిన్న కథాంశాలను ఎంచుకోవడం మెగాస్టార్‌లోని పరిణితికి నిదర్శనం. యువ దర్శకుల క్రియేటివిటికీ తన అనుభవాన్ని జోడిస్తూ చిరంజీవి చేస్తున్న ఈ ప్రయాణం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిరు.. అనిల్ రావిపూడి, బాబీ లాంటికివారికి అవకాశాలు ఇచ్చి హిట్స్ కొట్టాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>