కలం, జనగామ: వేధింపులు, దాడులకు గురయ్యే మహిళలు, పిల్లలు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసేందుకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనగామ (Jangaon) జిల్లాలో తొలిసారిగా పోలీసులు బాధితురాలి ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశారు. జాఫర్‌గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. జాఫర్‌గఢ్ గ్రామంలో కొందరు వ్యక్తులు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమస్యను చెప్పుకుంది. ఎస్ఐ బి.రామారావు మహిళ ఇంటికి వెళ్లి ఫిర్యాదును స్వీకరించి, అక్కడే కేసు నమోదు చేశారు.


