కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చిరుత హడలెత్తిస్తోంది. ఇటీవల లింగంపేట్ మండలంలో రోడ్డు దాటుతూ కనిపించిన చిరుత ప్రస్తుతం నాగిరెడ్డి పేట మండలంలోకి ప్రవేశించింది. ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలోకి చిరుత (Leopard) వెళ్తుండగా జనాలు చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి వాసుదేవ్ సిబ్బందితో చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలతోపాటు, విసర్జిత పదార్థాలను సేకరించారు. ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న మాట నిజమేనని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాసుదేవ్ సూచించారు.
Read Also: ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. గ్రామీణ ఉపాధిపై సర్కారు సతమతం
Follow Us On: Sharechat


