కలం వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మంగళవారం ఉదయం హరీష్ నివాసానికి చేరుకున్నారు. విచారణలో ఏయే అంశాలు మాట్లాడాలనే దానిపై తమ లీగల్ టీంతో హరీష్, కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు కూడా హరీష్ నివాసానికి తరలివస్తున్నారు. ఈ భేటీ అనంతరం హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు హాజరవుతారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌తో పాటు, తెలంఆణ భవన్, హరీష్ నివాసం వద్ద పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.


