Mobile Popup Ad
Mobile Popup Ad

ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలే కొనాలి.. సీఎం ఆదేశాలు

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రభుత్వ శాఖలు ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (Electric Vehicles) మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని అధికారుల‌కు సూచించారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్ర‌భుత్వ శాఖ‌లు అద్దెకు తీసుకునే వాహ‌నాలు సైతం ఈవీలే ఉండాల‌ని తెలిపారు. ర‌వాణా శాఖ‌లోని మాన్యువ‌ల్ విధానాలకు స్వ‌స్తి చెప్పాల‌ని, మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రవాణా శాఖ అంశాలపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్‌టీవో కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగడానికి వీల్లేద‌ని, వెంట‌నే సొంత‌ భ‌వ‌నాల నిర్మాణాలకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సీఎం ఆదేశించారు. రోడ్డు ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న పెంచాల‌ని, ప్రజల్లో చైతన్యం తీసుకురావ‌డానికి షార్ట్ ఫిల్మ్‌లు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. శంషాబాద్ స‌మీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభ‌మ‌య్యే ప్రాంతంలో అధునాత‌న బస్ టెర్మినల్‌కు స్థ‌లం కేటాయిస్తామ‌ని, అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సీఎం ఆదేశించారు.

Read Also: గిగ్ వర్కర్లకు వార్ కష్టాలు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>