నేడు నెల్లూరులో మంత్రి నారా లోకేశ్ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : నేడు (గురువారం) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నెల్లూరు (Nellore) జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆయన జువ్వలదిన్నె (Juvvaladinne) గ్రామానికి చేరుకుని ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డు (Autonomous Maritime Shipyard) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అత్యాధునిక మారిటైం షిప్ యార్డు పరిశ్రమను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంతంలో 750 మందికిపైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అటానమస్ టెక్నాలజీతో నడిచే సముద్ర నౌకల తయారీ, అభివృద్ధికి ఈ షిప్ యార్డు కేంద్రంగా మారనుంది. సముద్ర రక్షణ, సర్వే, కమర్షియల్ రంగాల్లో వినియోగించే ఆధునిక నౌకల తయారీలో ఈ యార్డు కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నెల్లూరు (Nellore) జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>