epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

రాసలీలల వీడియోల లీక్ ఘటన.. కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి సస్పెండ్

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు కార్యాలయంలోనే మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంది. వీడియోల (Video) లీక్ ఘటనలో కర్ణాటక డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసింది. దీనిపై విచారణ చేపట్టి రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించాడని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంక్వయిరీ ప్రారంభించినట్లు సర్వీసు విభాగం అండర్ సెక్రటరీ అశోక్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉంటూ యూనిఫామ్ ధరించి కార్యాలయంలోనే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు తేలడంతో అఖిల భారత అధికారుల సర్వీసు నిబంధనల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. విచారణ జరుగుతూ ఉన్నందున సస్పెన్షన్ కాలం ముగిసే వరకు హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళవద్దని, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా నగరాన్ని దాటి వెళ్ళకూడదని ఆ ఉత్తర్వుల్లో అశోక స్పష్టం చేశారు.

కర్ణాటక రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు ప్రభుత్వ కార్యాలయంలో కొందరు మహిళతో ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు రావడంతో కర్ణాటక పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకుంటామని చెప్పింది. అదే సమయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  నివేదిక కోరారు. పోలీస్ ఉన్నతాధికారుల రిపోర్ట్ మేరకు కర్ణాటక ప్రభుత్వం డీజీపీ స్థాయి అధికారిపై వేటు వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>