కలం, వెబ్ డెస్క్ : బొట్టు పెట్టుకున్నాడని ఓ విద్యార్థిపై స్కూల్ మేనేజ్ మెంట్ వివక్ష చూపించడం సంచలనంగా మారింది. కాకపోతే ఇది లండన్ లో (London) జరిగింది. లండన్ లోని ఓ స్కూల్ లో హిందూ విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అతను బొట్టు పెట్టుకుని స్కూల్ కు వెళ్లడంతో మేనేజ్ మెంట్ ప్రత్యేకదృష్టి సారించింది. అతని మతపరమైన విషయాలను తెలుసుకోవడం.. స్టూడెంట్లతో ఆడుకుంటుంటే హెడ్ మాస్టర్ అతని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం లాంటివి విద్యార్థిని మానసికంగా ఇబ్బంది పెట్టాయని ఇన్ సైట్ యూకే సంస్థ వెల్లడించింది. విద్యార్థి తల్లిదండ్రులు తమ మతపరమైన విషయాలను చెప్పి చూసినా లాభం లేకపోవడంతో చివరకు స్కూల్ మానినట్టు ఈ సైట్ యూకే సంస్థ తెలిపింది. గతంలో కూడా ఈ స్కూల్ లో ఇలాంటి మతపరమైన వివక్ష వల్ల కొందరు స్టూడెంట్లు వెళ్లిపోయినట్టు సైట్ యూకే తెలిపింది.
Read Also: కేరళ బస్సు ఘటన.. మహిళపై ఎఫ్ఐఆర్
Follow Us On: Sharechat


