Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు కావూరి సాంబశివరావు అంత్యక్రియలు

క‌లం, వెబ్ డెస్క్‌: నేడు మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు (Kavuri Sambasiva Rao) అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ప్ర‌భుత్వ‌ అధికార లాంఛ‌నాలతో సాంబశివరావు అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే బంధువులు, ఇత‌రుల‌ సందర్శనార్థం కావూరి పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఉంచారు. మ‌రికొద్ది సేప‌ట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు కావూరికి నివాళి అర్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. మధ్యాహ్నం కావూరి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. రెండు గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో సాంబశివరావు అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>