Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య..!

క‌లం, వెబ్ డెస్క్‌: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో దారుణం జ‌రిగింది. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో ఓ కాంగ్రెస్ నేత(Congress Leader) హ‌త్య‌ను దారుణంగా హ‌త‌మార్చారు. ఇందల్ వాయి మండలం గౌరారంలో ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ కారులో వెళ్తుండ‌గా త‌న ద‌గ్గ‌రి బంధువు దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పాత కక్షల కారణంగానే గోపీని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం గోపీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడిగా పని చేస్తున్నారు. గోపీ భార్య హేమ‌ల‌త ఇటీవ‌ల‌ గౌరారం సర్పంచిగా ఎన్నిక‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>