కలం, తెలంగాణ బ్యూరో: ఇరాన్‌లో యుద్ధంతో ఇండియాలో గిగ్ వర్కర్ల నెత్తిన పిడుగు పడింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల షార్టేజీతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. మెనూ నుంచి డీప్ ఫ్రై వెరైటీలను తొలగించాయి. పార్సిల్ సర్వీసులను ఆపివేశాయి. ఫుడ్ డెలివరీలనూ తగ్గించేశాయి. దీంతో స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఆర్డర్లు తగ్గిపోతున్నాయి. వీటిపై ఆధారపడి బతుకుతున్న యువతకు (Gig Workers) ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఒక్కొక్కరికి ప్రతి రోజు యావరేజ్‌గా ఉండే 15 ఫుడ్ డెలివరీలు ఇప్పుడు నాలుగైదుకు పడిపోయాయి. ఉద్యోగ భద్రత లేని డెలివరీ బాయ్‌లు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నారు. మరోవైపు సీఎన్జీ, ఎల్పీజీ సప్లై పరిమితం కావడంతో ఓలా, ఉబర్ డ్రైవర్లూ రీఫిల్లింగ్ కోసం బంకుల దగ్గర గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తున్నది. దీంతో బుకింగ్‌లు తగ్గిపోతున్నాయి. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి వారి ఫ్యూచర్‌ను ప్రశ్నార్థకం చేసింది.
గిగ్ వర్కర్లపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఆ ఒక్కడు ఎక్కడ? గణపతి పై వీడని సస్పెన్స్!
Follow Us On: X(Twitter)

