కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) సంచలనం సృష్టిస్తున్నది. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందల మంది సాక్ష్యులుగా వాంగ్మూలం ఇచ్చారు. నిందితులు విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు బీఆర్ ఎస్ పెద్దల విచారణ దశకు చేరింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మొదలు.. ఇప్పటి వరకు వరకు ఏం జరిగింది?!
2024 మార్చి 10:
• 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) ఆఫీసులోని డేటాను, హార్డ్ డిస్క్ లను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారంటూ 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐబీ అడిషనల్ ఎస్పీ డి. రమేశ్ ఫిర్యాదు చేశారు. పలువురు తమ ఫోన్లను గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందంటూ కంప్లయింట్స్ ఇచ్చారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నమోదైంది. విచారణ కోసం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంటకగిరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఐదుగురితో స్పెషల్ టీమ్ ఏర్పాటు.
2024 మార్చి 13:
• పంజాగుట్టలో నమోదైన కేసు ఆధారంగా ప్రణీత్ రావు అరెస్ట్.
2024 మార్చి 23:
మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ తిరుపతన్న అరెస్ట్.
2024 మార్చి 29:
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ పి. రాధాకిషన్ రావు అరెస్ట్.
2025 డిసెంబర్ 12:
ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao).. 2024 మార్చిలో కేసు నమోదు అంశం తెలియగానే అమెరికా వెళ్లిపోయారు. రాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ఆయనను హైదరాబాద్కు 2025 డిసెంబర్ లో రప్పించారు. డిసెంబర్ 12న ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు.
2025 డిసెంబర్ 18:
దాదాపు ఏడాదిన్నరపాటు పలువురు నిందితులను, సాక్ష్యులను స్పెషల్ టీమ్ విచారించగా.. కేసు కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో మరింత లోతైన విచారణ కోసం, పటిష్ట చార్జిషీట్ కోసం డీజీపీ 2025 డిసెంబర్ 18న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు. సిద్దిపేట సీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, రామగుండం సీపీ అంబర్ కిశోర్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హెచ్ ఎంఆర్ ఎల్ డీఎస్పీ నాగేందర్ రావు సభ్యులు.
2026 జనవరి 20:
సిట్ ముందు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హాజరు. ఏడు గంటలపాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించిన అధికారులు. బీఆర్ ఎస్ కీలక నేతను సిట్ విచారించడం ఇదే మొదటిసారి.
2026 జనవరి 22:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు సిట్ నోటీసులు. శుక్రవారం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆదేశాలు.
Read Also: సిరిసిల్లలో బీఆర్ ఎస్ కు తేడా కొడుతోందా..?
Follow Us On: Sharechat


