కలం, వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika) రీసెంట్ గానే హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక (Rashmika) తల్లి సుమన్ మందన్నా పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రక్షిత్ శెట్టితో రష్మిక ఎందుకు విడిపోయిందో ఆమె చెప్పింది. ఆ వీడియోపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ వీడియోలో సుమన్ మందన్నా మాట్లాడుతూ.. రక్షిత్ శెట్టి పెట్టిన కండీషన్ల వల్లే తన కూతురు విడిపోయినట్టు తెలిపారు.
ఆమె చెప్పిన దాని ప్రకారం.. ‘ఎంగేజ్ మెంట్ అయిన కొన్ని రోజులకే నా కూతురును ఇబ్బంది పెట్టింది రక్షిత్ శెట్టి ప్యామిలీ. పెళ్లి అయిన తర్వాత సినిమాలు మానేయాలని రక్షిత్ శెట్టి ఒత్తిడి చేశాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా ప్రకటించాలని చెప్పాడు. చాలా విషయాల్లో రక్షిత్ ఫ్యామిలీ రష్మికపై కండీషన్లు పెట్టింది. ఆ సమయంలో రష్మికకు అండగా నిలవాల్సిన రక్షిత్ వాదనలకు దిగాడు. అందుకే రష్మిక ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది’ అంటూ తెలిపింది సుమన్ మందన్నా.
అలాగే విజయ్ దేవరకొండతో గీతగోవిందం సినిమాలో రష్మిక లిప్ లాక్ సీన్ వల్లే రక్షిత్ తో గొడవలు అయ్యాయనే విషయంపై కూడా సుమన్ మందన్నా స్పందించారు. ఒక నటిగా తన కూతురు చేసిన పనిని తాను ఎప్పుడూ సమర్థిస్తానని తెలిపారు. అలాంటి విషయాలను సీరియస్ గా తీసుకుంటే ఏమీ చేయలేమని ఆమె చెప్పుకొచ్చారు. రష్మిక పెళ్లి సందర్భంగా ఈ పాత వీడియోను ఇప్పుడెందుకు వైరల్ చేస్తున్నారని కొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

