కలం, వెబ్‌డెస్క్: దేశంలో క్రెడిట్ కార్డు (Credit Card) సంస్థలు విధిస్తున్న వడ్డీ రేట్లను, పెనాల్టీ చార్జీలను తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి (Purandeswari ) విజ్క్షప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ‘దేశంలో క్రెడిట్ కార్డ్ సంస్థలు వినియోగదారులపై విధిస్తున్న వార్షిక వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 24శాతం నుంచి 48శాతం వరకు వడ్డీ రేట్లు రాబడుతున్నాయి. కొన్నైతే ఏకంగా 55.55శాతం వరకు విధిస్తున్నాయి. ఈ రేట్లు వినియోగదారులకు భారంగా ఉన్నాయి. వీటిని తగ్గించాలి’ అని వినతి పత్రంలో కేంద్ర మంత్రికి పురంధేశ్వరి నివేదించారు.
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ కార్డ్‌ల వడ్డీ, పెనాల్టీ ఛార్జీలను తగ్గిస్తూ విధించిన క్యాపింగ్‌ను లేఖలో పురంధేశ్వరి (Purandeswari) ప్రస్తావించారు. అమెరికాలో ఏకంగా 10శాతం తగ్గించారని నిర్మల దృష్టికి తీసుకెళ్లారు. మన దేశంలో ఆర్బీఐ ఇప్పటికే క్రెడిట్ కార్డ్ వడ్డీరేట్లు, పెనాల్టీ ఛార్జీల తగ్గింపుపై కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసిందన్నారు. క్రెడిట్ కార్డ్ సంస్థలు వడ్డీ రేట్లను ఎక్కువగా విధించడంలో పారదర్శకత లేదని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని వివరించారు. క్రెడిట్ కార్డుల అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కేంద్ర మంత్రిని పురంధేశ్వరి కోరారు.
Read Also: ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ అధికారంలోకి రాడు: విజయసాయి
Follow Us On : WhatsApp


