కలం వెబ్ డెస్క్: ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆఫీసులను పూర్తిగా ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని తెలంగాణ (Telangana) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రైవేట్ భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేసి, ఫిబ్రవరి 1 నుంచి నుంచి అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయం మేరకు జీహెచ్ఎంసీ (GHMC) పరిసర ప్రాంతంలోని 39 భవనాలు ప్రభుత్వ భవనాల్లోకి మారనున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని బిల్డింగ్స్ చీఫ్ ఇంజనీర్ (ఆర్ అండ్ బి) 4వ లేఖలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలకు మార్చడానికి డిపార్ట్మెంట్ల నియంత్రణలో పనిచేస్తున్న హెచ్ఓడీలందరికీ అవసరమైన సూచనలు జారీ చేశారు.
Read Also: ఎంక్వయిరీలతో కేడరంతా సిటీలోనే.. ‘మున్సిపోల్స్’ ప్రచారానికి బ్రేకులు
Follow Us On: Instagram


