కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి, మెదక్ (Medak), సిద్దిపేట జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల (Hailstorm) వర్షం కురుస్తున్నది. మెదక్ జిల్లా పాపన్నపేట (మం) మిన్ పూర్, లింగాయిపల్లి, పొడిచెన్ పల్లి గ్రామాల్లో వడగండ్లతో కూడిన వాన పడింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్, పుల్కల్, జోగిపేట, జిన్నారం, మొగడంపల్లి మండలాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురవగా, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఏరియాల్లో కూడా వాన పడింది. వడగండ్ల వానతో తమ పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు కూడా భారీ వడగండ్ల వర్షం ఉండటంతో రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఆయా జిల్లాల్లో రైతులను అలర్ట్ చేశారు.
Read Also: నల్లగొండ రహదారులు రక్తసిక్తం.. 75 రోజుల్లో 72 మంది మృతి
Follow Us On: Facebook

