Mobile Popup Ad
Mobile Popup Ad

ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీ అభివృద్ధి : సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్గా అభివృద్ధి చేయాలని సంబంధింత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు ఆదేశించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని నిర్దేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి ఒడిశా, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణబాబు, మారి టైమ్ బోర్డు సీఈఓ శ్రీ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

హిందూపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిందూపురంలో (Hindupur) భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని సీఎం చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. జాబ్ మేళాకు వచ్చిన 5323 మందిలో 1903 మంది ఉద్యోగాలకు ఎంపికకావడం సంతోషకరమని తెలిపారు. మరో 868 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తర్వాతి దశల ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిసిందన్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న 110 సంస్థలకు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.

Read Also: తెలుగువారి సత్తా చాటిన మహనీయుడు పొట్టి శ్రీరాములు: సీఎం చంద్రబాబు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>