Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

క‌లం, నిర్మ‌ల్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుట్టిన రోజు వేడుకలను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కూచాడి శ్రీహరి రావు నివాసంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. దేశ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు మరింత బలంగా, అభివృద్ధి దిశగా సాగాలంటే రాహుల్ గాంధీ వంటి నాయకత్వం అవసరమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>