కలం, తెలంగాణ బ్యూరో : గవర్నర్లతో రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ కలుస్తూ ఉండడం ఆనవాయితీ. కొత్తగా గవర్నర్ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రమాణ స్వీకారానికి వెళ్లడం సహజంగా కొనసాగే ప్రాక్టీస్. లేదా లోక్‌భవన్‌కు కర్టసీ విజిట్‌గా వెళ్ళి పలకరించడం చాలా చోట్ల జరిగే ట్రెడిషన్. ఇలాంటి సందర్భాలకు అధికార, ప్రతిపక్ష అనే తేడాలుండవ్. కానీ తెలంగాణలో మాత్రం అది డిఫరెంట్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ (KCR) వీటికి చాలా దూరం. తెలంగాణ ఫస్ట్ గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్ఎల్ నర్సింహన్‌తో క్లోజ్ రిలేషన్స్ కొనసాగించిన కేసీఆర్.. ఆ తర్వాత తమిళిసై సౌందర్ రాజన్ మొదలు తాజాగా శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) వరకు భిన్నమైన తీరునే ప్రదర్శిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు సైతం లోక్‌భవన్‌కు దూరంగానే ఉన్నారు.
లోక్‌భవన్‌కు నో కర్టసీ విజిట్ :
రాష్ట్రానికి కొత్తగా గవర్నర్‌గా వచ్చిన శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో, బీఆర్ఎస్ పార్టీ అధినేతగానూ కేసీఆర్‌కు ఆహ్వానం పంపింది. తప్పనిసరిగా హాజరు కావాలన్న నిబంధన లేకపోయినప్పటికీ కర్టసీగా హాజరు కావడం ఆనవాయితీ. కానీ ఆ కార్యక్రమానికి కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఇటీవలి కాలం వరకూ గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ 2024 జూలైలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఆ తర్వాత కర్టసీ విజిట్‌గా లోక్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను పలకరించలేదు. గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాత్రం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన జిష్ణుదేవ్ వర్మను అసెంబ్లీలోకి స్వాగతించడం, వీడ్కోలు పలకడం వరకే పరిమితమయ్యారు. తమిళిసై సౌందర్ రాజన్ గవర్నర్‌గా ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శల సంగతి సరేసరి.
ఈసారి అసెంబ్లీలోనైన పలకరిస్తారా?
గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి దూరంగా ఉన్న కేసీఆర్ ఆ తర్వాత లోక్‌భవన్‌కు కూడా వెళ్ళి కర్టసీగా ఆయనను పలకరించలేదు. కొద్దిమంది మంత్రులు ప్రమాణ స్వీకారం రోజున జిల్లాల పర్యటనల్లో ఉండంతో ఆ తర్వాత లోక్‌భవన్‌కు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా పలువురు వెళ్ళి పలకరించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం అలాంటి సంప్రదాయాన్ని పట్టించుకోలేదు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వస్తున్న సందర్భంగానైనా అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్ హాజరై పలకరిస్తారా?.. గతేడాది డిసెంబరు చివరి వారంలో జరిగిన సెషన్‌కు హాజరైనందున ఇప్పుడు దూరంగానే ఉండిపోతారా?.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత స్పీకర్ చాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. 2024 జూలైలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగానికి ఫస్ట్ టైమ్ హాజరయ్యారు. ఆ తర్వాత గతేడాది మార్చి 12న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. చివరిసారిగా గతేడాది డిసెంబరు 29న సభకు హాజరై మాజీ ఎమ్మెల్యేల మృతి సందర్భంగా జరిగిన సంతాప సందేశం ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు.
Read Also: నెతన్యాహు బతికే ఉంటే చంపేస్తాం: ఇరాన్ హెచ్చరిక
Follow Us On: Instagram

