Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కలం, నల్లగొండ బ్యూరో : పొట్టకూటి కోసం బతికేందుకు వచ్చిన కూలీలను రోడ్డు ప్రమాదం (Road Accident) రూపంలో మృత్యువు మింగేసింది. ఇటుక బట్టీల్లో బీహార్ నుంచి పనిచేసేందుకు వచ్చిన కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఓ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నల్లగొండ (Nalgonda) జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేటు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు చింతపల్లి మండలంలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చారు. గతకొంతకాలంగా ఇటుక బట్టీలోనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆదివారం కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు తీసుకునేందుకు వచ్చిన క్రమంలో ఈ ప్రమాదం (Road Accident) జరిగింది.

చింతపల్లి మండలం దేవతపల్లి గేటు వద్ద ఆటోని వేగంగా వచ్చిన భారీ లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో ఆటో డ్రైవర్ కొర్ర బోడ్య(57), బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీ సంతోష్ ఖలీఫా(40), ఏపీలోని బాపట్లకు చెందిన బండారు ఇస్సాక్(55) ఉన్నారు. ప్రమాద ధాటికి ఆటో కూడా నుజ్జునుజ్జయింది. లారీ మితిమీరిన వేగం, డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. దేవతపల్లి గేట్ వద్ద మలుపు ఉండడం.. అదే సమయంలో లారీ వేగంగా రావడంతో ఆటోను తప్పించే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>