గ్యాస్ కొరత.. గ్రౌండ్ రియాలిటీ ఏంటి?

కలం, తెలంగాణ బ్యూరో: ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం తెలంగాణపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు బంద్ అయ్యాయి. ఐటీ కారిడార్ సమీపంలోని హాస్టళ్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మెనూలలో ఫుడ్ ఐటెమ్స్ తగ్గిపోయాయి. రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ మూతబడ్డాయి. హోటళ్లు, రెస్టారెంట్‌లలో పార్సిల్ సెక్షన్‌కు బ్రేక్ పడింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు గణనీయంగా తగ్గిపోయాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు పరిమిత స్థాయిలో సరఫరా (LPG Supply) కావడంతో నాలుగైదు రోజులుగా కొన్ని ఆంక్షలతోనైనా ఇవి నడిచాయి. కానీ ఆయిల్ కంపెనీల ఆదేశాలతో ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రులకు మినహా ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్లకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగనున్నదో తెలియని గందరగోళం నెలకొన్నది. ఎల్పీజీ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా.. గ్రౌండ్ రియాలిటీ ఇందుకు భిన్నంగా ఉన్నది. ఉపాధి అవకాశాల్లేకుండా చేసిన గ్యాస్ బాంబ్ పై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

LPG Supply
LPG Supply

Read Also: వార్​ ఎఫెక్ట్..​ కరెంట్​​ షాక్!!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>