కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా గన్నవరం (Gannavaram) నియోజకవర్గం కీసరపల్లిలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ అత్యుత్సాహంతో యువకుడు చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్ అనే యువకుడు తన తమ్ముడు కౌశిక్ ను విజయవాడ అవుటపల్లిలోని ఎంఎంఎం కాలేజీలో దింపడానికి వెళ్తుున్నాడు. కీసరపల్లి వద్దకు రాగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ ను ఆపేందుకు ప్రయత్నించారు. ప్రణయ్ కాస్త స్లో చేయడంతో.. కానిస్టేబుల్ వెంటనే బైక్ హ్యాండిల్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. భయపడిపోయిన ప్రణయ్.. బైక్ ను వెనక్కు తిప్పేందుకు ట్రై చేశాడు.
దీంతో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ను బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్, కౌశిక్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రణయ్ చనిపోయాడు. కౌశిక్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసుల అత్యాత్సాహంతోనే ప్రణయ్ చనిపోయాడంటూ బంధవులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని వల్లభనేని వంశీ పరామర్శించారు.

