కలం, నేషనల్ బ్యూరో : ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఫిక్స్ చేసింది. షెడ్యూలు (EC Schedule) రిలీజ్ చేసింది. ఆదివారం సెలవు రోజైనా షెడ్యూలు ప్రకటించడం విశేషం. షెడ్యూలు విడుదలతోనే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఫలితాలు వెలువడేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం 2.19 లక్షలు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా.. 25 లక్షల మంది స్టాఫ్ పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా అసోం, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మాత్రం సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే రోజున మే 4న కౌంటింగ్ జరగనున్నది. షెడ్యూలు ఏ క్షణమైనా విడుదల కావచ్చన్న అంచనాతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. సంక్షేమ పథకాలను ప్రకటించాయి. ఆన్ గోయింగ్ స్కీమ్‌లకు నిధుల విడుదలపైనా నిర్ణయం తీసుకున్నాయి.
రాష్ట్రాల వారీగా ఓటర్ల వివరాలు
అసోం ఓటర్లు : 2.50 కోట్లు
పశ్చిమబెంగాల్ ఓటర్లు : 6.44 కోట్లు
తమిళనాడు ఓటర్లు : 5.67 కోట్లు
కేరళం ఓటర్లు : 2.70 కోట్లు
పుదుచ్చేరి ఓటర్లు : 9.44 లక్షలు
అసోం (126 స్థానాలు)
ఎలక్షన్ నోటిఫికేషన్ : మార్చి 16
నామినేషన్లు ప్రారంభం : మార్చి 16
నామినేషన్లకు తుది గడువు : మార్చి 23
స్క్రూటినీ జరిగేది : మార్చి 24
ఉపసంహరణకు గడువు : మార్చి 26
పోలింగ్ తేదీలు : ఏప్రిల్ 9
ఫలితాల వెల్లడి : మే 4
==========
పశ్చిమ బెంగాల్ : (294 స్థానాలు)
ఎలక్షన్ నోటిఫికేషన్ : మార్చి 30, ఏప్రిల్ 2
నామినేషన్లు ప్రారంభం : మార్చి 30, ఏప్రిల్ 2
నామినేషన్లకు తుది గడువు : ఏప్రిల్ 6, ఏప్రిల్ 9
స్క్రూటినీ జరిగేది : ఏప్రిల్ 7, 10
ఉపసంహరణకు గడువు : ఏప్రిల్ 9, 13
పోలింగ్ తేదీలు : రెండు ఫేజ్‌లు – ఏప్రిల్ 23, 29
ఫలితాల వెల్లడి : మే 4
===========
కేరళం (140 స్థానాలు)
ఎలక్షన్ నోటిఫికేషన్ : మార్చి 16
నామినేషన్లు ప్రారంభం : మార్చి 16
నామినేషన్లకు తుది గడువు : మార్చి 23
స్క్రూటినీ జరిగేది : మార్చి 24
ఉపసంహరణకు గడువు : మార్చి 26
పోలింగ్ తేదీలు : ఏప్రిల్ 9
ఫలితాల వెల్లడి : మే 4
=========
పుదుచ్చేరి (30 స్థానాలు) (కేంద్రపాలిత ప్రాంతం)
ఎలక్షన్ నోటిఫికేషన్ : మార్చి 16
నామినేషన్లు ప్రారంభం : మార్చి 16
నామినేషన్లకు తుది గడువు : మార్చి 23
స్క్రూటినీ జరిగేది : మార్చి 24
ఉపసంహరణకు గడువు : మార్చి 26
పోలింగ్ తేదీలు : ఏప్రిల్ 9
ఫలితాల వెల్లడి : మే 4
తమిళనాడు (234 స్థానాలు)
ఎలక్షన్ నోటిఫికేషన్ : మార్చి 30
నామినేషన్లు ప్రారంభం : మార్చి 30
నామినేషన్లకు తుది గడువు : ఏప్రిల్ 6
స్క్రూటినీ జరిగేది : ఏప్రిల్ 7
ఉపసంహరణకు గడువు : ఏప్రిల్ 9
పోలింగ్ తేదీలు : ఏప్రిల్ 23
ఫలితాల వెల్లడి : మే 4
===========

