కలం, వరంగల్ బ్యూరో : పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్, హౌస్ బూజూర్గు గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసారు. అనంతరం కుటుంబ సభ్యులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామాలు లేవని.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

