గ్యాస్ బుకింగ్.. ఔటాఫ్ కవరేజ్

కలం, తెలంగాణ బ్యూరో: Gas Crisis | ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా, అధికారులతో ఎన్ని రివ్యూలు చేసినా రాష్ట్రంలో వంట గ్యాస్ కష్టాలు మాత్రం తీరట్లేదు. పట్నం నుంచి పల్లె దాకా ఇదే తంతు. ఏజెన్సీలు, గోడౌన్ల దగ్గర ఖాళీ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. సర్వర్లు మొరాయించడంతో బుకింగ్‌లు ఆగిపోయాయి. టోల్ ఫ్రీ, కస్టమర్ కేర్ నెంబర్లు కనెక్ట్ కావడంలేదు. అదృష్టం కొద్దీ కనెక్ట్ అయినా ఓటీపీలు జనరేట్ కావడంలేదు. అది లేకుండా ఏజెన్సీలు డెలివరీ చేయడంలేదు.

ఇప్పటికే బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఓటీపీలు వచ్చినా రీఫిల్లింగ్ సిలిండర్లు అందడంలేదు. స్టాక్ వచ్చాకనే ఇస్తామంటూ డీలర్లు సర్దిచెప్తున్నారు. ఏజెన్సీలు ఒక చోట, గోడౌన్లు మరో చోట ఉండడంతో జనం ఈ రెంటి మధ్య చక్కర్లు కొడుతున్నారు. స్టాక్ ఎప్పుడొస్తుందో వినియోగదారులకు తెలియదు.. వచ్చాక బినామీ, బోగస్ పేర్లతో ఎవరికి డెలివరీ అవుతున్నాయో అర్థం కాదు. సందట్లో సడేమియా అన్నట్లుగా దొడ్డి దారిన ఎక్కువ రేటుకు అమ్ముకునే దందా కంటికి కనిపించకుండా జరిగిపోతున్నది.

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ ఇక్కట్లపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Gas Crisis
Gas Crisis

Read Also: విగ్రహాలు.. వివాదాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>