కలం తెలంగాణ బ్యూరో: దేశంలో ప్రతీ భారీ విగ్రహ నిర్మాణం వెనక వివాదం.. స్వాతంత్ర్య సమరయోధులు మొదలు రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు వరకు ఆరోపణలే. నిర్వాసిత బాధితులూ కోకొల్లలు. ఒక పార్టీ దిగిపోగానే మరో పార్టీ అధికారంలోకి రావడం.. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం.. అందుకు రూ. వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం పెడతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ప్రభుత్వాలు పోటాపోటీగా (Statue Politics) తీసుకునే నిర్ణయాలు ప్రజల ఇండ్లను కూల్చేస్తున్నాయి. గుజరాత్‌లో పటేల్ విగ్రహం ఏర్పాటు కారణంగా ఎంతోమంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. ఇప్పటికీ పరిహారం అందక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. మేధాపాట్కర్ వంటి సామాజిక కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
తెలంగాణలోనూ గాంధీ సరోవర్ పేరిట మహాత్మాగాంధీ భారీ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చేపట్టిన భూసేకరణపై వ్యతిరేకత మొదలైంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం సామాన్యుల ఇళ్లను కూల్చొద్దని ముఖ్యమంత్రికి గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలోనూ అప్పట్లో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. విగ్రహాలు, వివాదాలపై ‘కలం’ 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఇఫ్తార్ ఫర్ ఆల్.. అందరి ఆకలి తీర్చే ఆలోచన మొదలైందిలా..!
Follow Us On: Instagram

