డ్రగ్స్ టెస్టుకు ఎప్పుడైనా రెడీ.. వాళ్లను చట్టపరంగా శిక్షించండి : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. రోహిత్ రెడ్డికి టెస్టుల్లో పాజిటివ్ రావడంతో రాజకీయ రగడ మొదలైంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. బీఆర్ ఎస్ పార్టీ మొదటి నుంచి డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు.

డ్రగ్స్ మానవులను రాక్షసులుగా మారుస్తాయని.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం అని కేటీఆర్ (KTR) చెప్పారు. తాను డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడే వారిని, అమ్మేవారిని చట్టపరంగా శిక్షించాలని.. ఇలాంటి కేసులకు రాజకీయ పార్టీలతో ఏం సంబంధం అని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ కు సిద్ధమని ప్రకటించారు. తాను గతంలో చాలా సార్లు చెప్పానని.. డ్రగ్స్ టెస్టుకు ఎప్పుడైనా రెడీ అంటూ తేల్చి చెప్పారు కేటీఆర్. ప్రజా ప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్ టెస్టుకు ముందుకు రావాలని కేటీఆర్ చెప్పారు. అలాగే ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును తప్పుగా ప్రచారం చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి వారికి లీగల్ నోటీసులు ఇస్తానంటూ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల ముందు డ్రగ్స్ కేసు బీఆర్ ఎస్ ను డైలమాలో పడేసింది. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ను నిలదీయాలని బీఆర్ ఎస్ భావిస్తుంటే.. ఇప్పుడు టాపిక్ మొత్తం డైవర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>