epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

బంగారం భలే చౌక.. ఎక్కడంటే?

కలం, వెబ్ డెస్క్: అక్కడ బంగారం భలే తక్కువ ధరకు (Gold Rates) లభిస్తోంది. కేజీల లెక్కన బంగారం అమ్మేస్తున్నారు. మార్కెట్‌లో కిలోల లెక్కన కూరగాయలు అమ్ముతున్నట్టు .. అక్కడ బంగారం అమ్మేస్తున్నారు. ‘చౌక, చౌక, కేజీ బంగారం రూ. 50’ అంటూ అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో (AI Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తులం బంగారమే లక్షల్లో పలుకుతుంటే అంత చవగ్గా ఎక్కడ అమ్ముతున్నారని ఆశ్చర్యపోతున్నారా.. నిజానికి అదో ఏఐ వీడియో.. ఆ వీడియోలో ఇలా తక్కువ ధరకే (Gold Rates) బంగారం అమ్ముతున్నట్టు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల ఇటువంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని వీడియోలు అయితే నిజం అని భ్రమించేలా ఉంటున్నాయి. నటుడు రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ పెట్టాడంటే ఓ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది. చాలా మంది నిజమని నమ్మేశారు కూడా. ఇలా ఏఐ యుగంలో ఏది నిజం, ఏది అబద్ధమో కూడా తెలుసుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి ఈ వీడియోలకు డిమాండ్ మాత్రం తెగ పెరుగుతోంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

Read Also: జీమెయిల్​, ఎఫ్​బీ​, నెట్​ఫ్లిక్స్​ యూజర్లకు అలర్ట్​.. 15కోట్ల పాస్​వర్డ్​లు లీక్​!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>