epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

జీమెయిల్​, ఎఫ్​బీ​, నెట్​ఫ్లిక్స్​ యూజర్లకు అలర్ట్​.. 15కోట్ల పాస్​వర్డ్​లు లీక్​!

కలం, వెబ్​డెస్క్​: ఆన్​లైన్​ యూజర్లకు అలర్ట్​. జీమెయిల్​, ఇన్​స్టాగ్రామ్ (Instagram)​, ఫేస్​బుక్​ (FB), నెట్​ఫ్లిక్స్​, అవుట్​లుక్​, యాహూ తదితర ఫ్లాట్​ఫ్లామ్స్​కు సంబంధించి 14.9కోట్ల పాస్​వర్డ్​లు, లాగిన్స్​ లీకయ్యాయి (Passwords Leak). ఈ మేరకు సైబర్​ సెక్యూరిటీ సంస్థ ఎక్స్​ప్రెస్​ వీపీఎన్​ ఓ రిపోర్ట్​లో వెల్లడించింది. సైబర్​ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్​ జెరేమీ ఫౌలర్​ ఈ నివేదిక తయారుచేశారు. దీని ప్రకారం పబ్లిక్​ డొమైన్​లో వివిధ ఖాతాలకు సంబంధించి 1,49,404,754 లాగిన్​లు, పాస్​వర్డ్​లు ఉన్నాయి. మొత్తం 96జీబీ పరిమాణంలోని ఈ డేటాకు ఎలాంటి రక్షణ/ఎన్​క్రిప్షన్​ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

లీకైన డేటాలో జీమెయిల్​కు సంబంధించి 4.8కోట్లు అకౌంట్లు, యాహూ–40లక్షలు, ఫేస్​బుక్​–1.7కోట్లు, ఇన్​స్టా – 65లక్షలు, నెట్​ఫ్లిక్స్​–34లక్షలు, అవుట్​లుక్​కు చెందిన 15లక్షల ఖాతాల లాగిన్​, పాస్​వర్డ్​లు ఉన్నాయి (Passwords Leak). పబ్లిక్​ డొమైన్​లో ఉన్న ఈ వివరాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో, దీన్ని ఎవరైనా హ్యాకర్స్​ తీసుకుంటే ప్రమాదకరమని నివేదిక హెచ్చరిస్తోంది. పబ్లిక్​ డొమైన్​లో ఉన్నవాటిలో ‘.gov’ ఖాతాలు, బ్యాంకింగ్​, క్రెడిట్​ కార్డ్​లు, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ అకౌంట్లు ఉండడం ఆందోళనకరమని చెబుతోంది. ఆర్థిక నేరాలే కాకుండా ప్రజల వ్యక్తిగత భద్రత, దేశ రక్షణకు కూడా ముప్పని హెచ్చరిస్తోంది. కాగా, నివేదికలో తెలిపిన సంస్థలను ఈ విషయమై సంప్రదించినా సమాధానం లేదని జెరేమీ ఫౌలర్​ అంటున్నారు.

Read Also: 40 ఏండ్లకే ఇంటికి.. టెకీలకు కంపెనీల షాక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>