కలం, వెబ్ డెస్క్ : టీడీపీ ఎంపీల పనితీరు మెరుగవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ నిర్వహించారు. ఇందులో సీఎం మాట్లాడుతూ.. ఎంపీలకు అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా నిర్వహించాలని.. అందుకు తగ్గట్టు సన్నద్ధం కావాలన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉందని.. దాన్ని కాపాడేలా ఎంపీలు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వస్తున్నాయని.. మరింతగా అభివృద్ధి చేసేలా అందరూ కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: ఏపీ నుంచి నలుగురికి పద్మ అవార్డులు
Follow Us On: Sharechat


