కలం, వెబ్ డెస్క్ : మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో అమలవుతున్న అనంత నీరు సంరక్షణ ప్రాజెక్ట్ ను ప్రస్తావించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
10కి పైగా జలాశయాల పునరుద్ధరణ, 7,000కు పైగా మొక్కలు నాటడం ద్వారా.. నీటి భద్రతకు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడంతో, అనంతపురం ప్రజల కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు నీటి సంరక్షణ ఉద్యమానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.
Read Also: ఎంపీల పనితీరు మెరుగవ్వాలి : సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp


