కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి విడదల రజని (Vidadala Rajini) కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోకేశ్ గత ఎన్నికలకు ముందు ప్రస్తావించిన రెడ్ బుక్ ఇప్పుడు రాష్ట్రంలో ‘బ్లడ్ బుక్’గా మారిందని ఆమె విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2500 మంది వైసీపీ (YCP) నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, దాదాపు 800 మందిపై హత్యాయత్నాలు జరగాయని ఆరోపించారు. 390 మందిని దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే 700 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలైన 70 మందికిపైగా జర్నలిస్టులపై దాడులు చేశారని రజని మండిపడ్డారు. ప్రభుత్వం యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు రక్తపాతానికి పాల్పడుతోందని రజని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: దారుణం.. జర్నలిస్టుతో కాళ్లు పట్టించుకున్న కాలేజీ యాజమాన్యం
Follow Us On : WhatsApp

