సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం: భారత్‌ గిన్నిస్ రికార్డు

కలం, వెబ్‌ డెస్క్ : నీలి రంగు సముద్ర జలాల సాక్షిగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని స్వరాజ్ ద్వీప్ అరుదైన ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. రాధానగర్ బీచ్ వద్ద ఏకంగా 200 మంది డైవర్లు సముద్రం లోపల 60×40 మీటర్ల భారీ భారత జాతీయ జెండాను (India National Flag) ఆవిష్కరించి సరికొత్త చరిత్ర సృష్టించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ అద్భుత ఘట్టం భారతదేశ సామర్థ్యాన్ని, పట్టుదలను ప్రపంచానికి చాటిచెప్పింది.

శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో నిపుణులైన డైవర్లు సమన్వయంతో వ్యవహరించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ భారీ పతాకాన్ని సముద్రపు అడుగున పరిచారు. అండమాన్ నికోబార్ యంత్రాంగం చేపట్టిన ఈ సాహసోపేత ప్రయత్నం కేవలం ఒక రికార్డుగానే (Guinness World Record) కాకుండా, దేశ గ్లోబల్ అంబిషన్ కు చిహ్నంగా నిలుస్తోంది. గతంలో ఏ దేశం కూడా ఇంత భారీ స్థాయిలో నీటి లోపల జెండాను ప్రదర్శించలేదు. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: కవిత కొత్త పార్టీపై కేఏ పాల్ సంచలన కామెంట్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>