Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు : సీపీ

కలం, కరీంనగర్ బ్యూరో : కమిషనరేట్ ప్రజల రక్షణ, శాంతిభద్రతలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ (Karimnagar) పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ​అందులో భాగంగా నగరంలోని రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత స్థాయిలో, పోలీసు జాగిలాలతో తనిఖీలు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల కదలికలను గుర్తించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు. ఈ భద్రతా చర్యలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కరీంనగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712670744 ‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనరేట్ కి చెందిన పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>