Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రిలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు : ఎస్పీ రోహిత్ రాజ్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచి దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మొత్తం ఐదు లారీలు, ఒక జేసిబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీ, బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు, ఒక జేసిబీని సీజ్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj)  మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఉచిత ఇసుకను అందిస్తుందని, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని ఎస్పీ  వివరించారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>