దారుణం.. జ‌ర్నలిస్టుతో కాళ్లు ప‌ట్టించుకున్న కాలేజీ యాజ‌మాన్యం

కలం, వెబ్ డెస్క్: ఏపీలో జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన విషయం మరువకముందే తాజాగా అనంతపురంలో (Anantapur) దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గీతం జూనియర్ కళాశాల అక్రమాలను వెలుగులోకి తెచ్చారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ (Journalist) లక్ష్మీనారాయణపై ఆ సంస్థ యాజమాన్యం పైశాచికంగా ప్రవర్తించింది. ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా కన్న కొడుకు కళ్లముందే బలవంతంగా తమ కాళ్లు మొక్కించుకున్నారు. అక్కడితో ఆగకుండా క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు. ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఓ జర్నలిస్ట్ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించినందుకు ఇలాంటి అవమానానికి గురికావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: కరీంనగర్‌లో కాల్పులు.. కిలో బంగారం చోరీ: సీపీ గౌస్ ఆలం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>