కలం, వెబ్ డెస్క్: ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొనేందుకు అమెరికా నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయల్దేరిన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణాన్ని కొనసాగించడం సురక్షితం కాదని భావించిన పైలట్లు వెంటనే విమానాన్ని తిరిగి యునైటెడ్ స్టేట్స్‌లోని సమీప ఎయిర్ బేస్‌కు మళ్లించారు. దీంతో ట్రంప్ ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది.
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ట్రంప్‌తో పాటు విమానంలోని అందరూ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్ (Trump) దావోస్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సాంకేతిక లోపం పూర్తిగా పరిష్కారమైన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఆర్థిక సదస్సులో రాజకీయ, ఆర్థిక అంశాలపై కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్!
Follow Us On: X(Twitter)


