తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. దొంగ అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: వేసవి సెలవులు రావడంతో తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను (Thief) కారేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మూడు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి..

ఖమ్మం ఖిల్లా బజార్ ప్రాంతానికి చెందిన ఎండీ.మతిన్ ఆరు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఎస్సై గోపి తెలిపారు. ఇతడిపై కారేపల్లి పోలీస్ స్టేషన్ లో మూడు, మధిర, బోనకల్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదు అయినట్లు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి నిందితుడిని కారేపల్లి ఆటో స్టాండ్ వద్ద గుర్తించి అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇళ్లకు తాళం వేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>